గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూరత్ లో పర్యటిస్తున్నారు. సోమవారం మహువాలోని బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తుండగా ఆసక్తికర ఘటన జరిగింది. ఆయన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించగా.. మరో నేత గుజరాతీ భాషలో అనువాదం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త అందరికీ హిందీ అర్థమవుతుందని గుజరాతీ అనువాదం వద్దని కేకలు వేశాడు. దీంతో రాహుల్ అనువాదకున్ని పంపేసి హిందీలోనే ప్రసంగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa