కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామంలో ఆయా కులాల స్మశాన వాటిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కల్వర్టులు కుంగిపోయాయని వచ్చిన వార్తల్లో నిజం లేదని సర్పంచ్ పాలపర్తి అంజలి తెలియజేశారు. మంగళవారం నాడు ఆమె లోకల్ యాప్ తో మాట్లాడుతూ నాణ్యతలో ఎక్కడ రాజీ లేకుండా కల్వర్టులు నిర్మించినట్లు చెప్పారు. అయితే ఈమధ్య తుఫాన్ సమయంలో తీవ్రంగా వర్షాలు పడటం వల్ల కొంత కోతకు గురైందని అంజలి పేర్కొన్నారు. కల్వర్టును మళ్లీ మరమ్మత్తులు చేయించడానికి వర్షాలు ఆగకుండా పడటంతో చేయించలేకపోయామని వర్షం తగ్గగానే పనులు చేపడతామని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా కల్వర్టులను తాము దగ్గర ఉండి వేయించుకున్నామని నాణ్యతలో ఎక్కడ సర్పంచ్ రాజీ పడలేదని ఆయా స్మశాన వాటిక లకు సంబంధించిన కుల పెద్దలు తెలియజేశారు. తుఫానుకు పెద్దపెద్ద రోడ్డు లే కూలిపోయాయని వారు పేర్కొన్నారు.