ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. మూడు వాహనాలు,నాలుగు సెల్‌టవర్లు, రెండు రోడ్డు పని యంత్రాలను సోమవారం దహనం చేశారు. రెండు రాష్ట్రీయ రహదారులను దిగ్బంధం చేశారు. కాంకేర్ జిల్లా కడెమ్ -మెట్‌బోదెల్లీ అటవీప్రాంతంలో గత నెల 31న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నార్త్‌బస్తర్ డివిజన్ నేత దర్శన్ పద్దా, కమాండర్ జగదీష్ సలామ్ మృతి చెందారు. వారి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 22న మావోయిస్టులు మూడు జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. ఒకరోజు ముందే విధ్వంసం సృష్టించారు.