పంజాబ్లోని మొహాలీలో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. పాటియాలాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి పెళ్లి వేదిక వద్దకు వచ్చింది. వరుడు తనతో 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడని చెప్పింది. పోలీసులను వెంటపెట్టుకుని వచ్చి పెళ్లి వేదిక వద్ద గొడవ చేసింది. దీంతో సిర్హింద్ గ్రామానికి చెందిన వరుడిని మాటౌర్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వధువు తరుపు వారు పెళ్లి రద్దు చేసుకున్నారు.