ముంబైలోని భివండీలో చిన్నారులకు సోకే ‘మీజిల్స్’ వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. పట్టణ వ్యాప్తంగా ఇప్పటివరకూ 341 మందిలో వ్యాధి లక్షణాలు గుర్తించగా.. 44 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో చాలా మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ముంబైలోని మురికి వాడలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చిన్నారులకు టీకాలు వేయిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa