పాలకొండ. జగనన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఒ. ఆనంద్ అన్నారు. మంగళవారం పాలకొండ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో స్థానిక నగర పంచాయతీలోని సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలో ఇంత వరకు ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, ప్రారంభం కానివి ఎన్ని ఉన్నాయన్న వివరాలపై సమీక్షించారు. వెంటనే ప్రారంభం కాని గృహాలను ప్రారంభించేలా చూడాలన్నారు. సచివాలయాల వారీగా లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. అలాగే వివిధ స్థాయిల్లో ఉన్న ఇళ్లు పూర్తయ్యేలా చూడాలన్నారు. బిల్లులు కూడా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఐటిడిఎ పిఒ బి. నవ్య, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, హౌసింగ్ అధికారులు ఉన్నారు.