కార్తీక మాసం కావడంతో విజయవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో కనకదుర్గమ్మ హుండీ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 17 రోజులకు 3 కోట్ల 13 లక్షల 34 వేల రూపాయల నగదు, 994 గ్రాముల బంగారం, 7.435 కేజీల వెండి భక్తులు అమ్మవారికి బహుకరించారు. అంతేకాకకుండా ఈ-హుండీల రూపంలో మరో 55,623 రూపాయలు విరాళాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.