భారతదేశ ఎకానమీపై ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2022- 2047 కాలంలో దేశ ఆర్థిక వృద్ధి, అవకాశాలు భారీ స్థాయిలో పెరుగుతాయన్నారు. స్వచ్ఛ ఇంధనం, డిజిటలైజేషన్ వలన 2047 నాటికి భారత ఎకానమీ 13 రెట్లు పెరిగి 40 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన తెలిపారు.