కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసేలా కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, సెస్ పేరిట రాష్ట్రాల ఆర్థికవనరులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కేంద్రం చట్టాలు చేస్తూ రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యం చేస్తుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు.