కేంద్రం ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దేశంలో బడా వ్యాపారస్తుల రుణాలను మాఫీ చేస్తూ, ప్రజల సొమ్మును వృథా చేస్తుందని ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో NPAలు 365 శాతం పెరిగాయని తెలిపింది. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పరారీలో ఉన్న 38 మందిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వమే దేశానికి అతిపెద్ద NPA అని విమర్శించింది.