తమ దేశ పౌరుల ఓటు హక్కు వయస్సు తగ్గించేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం 18 ఏళ్లకు ఓటుహక్కు కల్పిస్తుండగా, దాన్ని 16 ఏళ్లకు తగ్గించాలని చూస్తోంది. కొన్ని దేశాలు ఇప్పటికే 16 ఏళ్లకే ఓటుహక్కు కల్పిస్తున్నాయి. 18 ఏళ్ల వారికే ఓటు కల్పించడం యువతపై వివక్షత చూపించడమేనని ఆ దేశ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓటుహక్కు వయస్సు తగ్గించాలంటే పార్లమెంట్ లో 75 శాతం సభ్యుల మద్దతు అవసరం.