గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు జిల్లాల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. గుజరాత్ కు చెందిన చాలామంది సరిహద్దు జిల్లాల్లో పని చేస్తున్నారని, దీంతో ఆయా జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు సెలవు ప్రకటించింది. ఎన్నికల రోజు ప్రైవేటు సంస్థలు కూడా సెలవు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది.