ప్రముఖ పేమెంట్స్ సంస్థ పేటీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ మంగళవారం ట్రేడింగ్ లో ఏకంగా 11% పతనమై రూ. 474కు చేరింది. గతేడాది నవంబర్లో IPOకు వచ్చిన పేటీఎం 2150 వద్ద లిస్టవగా, పది రోజుల క్రితం షేరు విలువ రూ. 600 కు ఎగువన ఉంది. తాజాగా రూ. 474.30 వద్ద కనిష్ట స్థానానికి చేరుకుంది. సాప్ట్ బ్యాంక్ పేటీఎం నుండి తన వాటాలను తగ్గించడం కూడా ఈ పతనానికి ఓ కారణమైంది.