ఏపీలోని రైతన్నలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. YSR సున్నా వడ్డీ పథకం అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా 2021 ఖరీఫ్ కు 5.68 లక్షల మంది, 2020-21 రబీ కు 2.54 లక్షల మంది అర్హులను గుర్తించింది. మొత్తం 8.22 లక్షల మంది అకౌంట్లలో రూ. 160.55 కోట్ల వడ్డీ రాయితీని ఈ నెల 28న సీఎం జమచేస్తారు. అర్హుల జాబితాను నేటి నుండి RBKలో ప్రదర్శిస్తారని, ఏమైనా తప్పులుంటే సంప్రదించాలని తెలిపారు.