అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల కలకలం రేగింది. చీసాపీక్లోని వాల్మార్ట్ స్టోర్లో మేనేజర్ తుపాకీ చేతబట్టి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఈ దారుణం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు చనిపోయాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.