కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పోల్నాటి శేషగిరిరావుపై దాడిచేసిన నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసినట్టు అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాస్ బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... విశాఖపట్నం ఆరిలోవ పెద గదిలి ప్రాంతానికి చెందిన కప్పా అభిరామ్ అనే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో పూజలు చేస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన అగ్రహారపు చంద్రశేఖర్ అతని వద్ద శిష్యుడిగా కొనసాగుతున్నాడు. తుని ప్రాంతంలోనూ పూజలు చేసే ఇతనికి... పోల్నాటి శేషగిరిరావు అనే వ్యక్తిపై దాడి చేయాలని, అందుకు డబ్బులు ఇస్తానని అభిరామ్ చెప్పాడు. అంగీకరించిన చంద్రశేఖర్ స్నేహితులతో కలిసి శేషగిరిరావు కదలికలను కొంతకాలంగా గమనిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం చంద్రశేఖర్ మోటారు సైకిల్‌పై శేషగిరిరావు ఇంటికి వచ్చి భిక్షం అడుగుతూ కత్తితో చేతిని నరికాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న చంద్రశేఖర్ బుధవారం తుని పోలీసుస్టేషన్‌లో విచారణ అధికారి మురళీమోహన్ ముందు లొంగిపోయినట్టు ఏఎస్పీ తెలిపారు.