పాకిస్థాన్ కొత్త ఆర్మీ ఛీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిం మునీర్ నియమితులయ్యారు. ఆరేళ్లుగా ఆ పదవిలో ఉన్న జనరల్ జావెద్ బాజ్వా నుంచి ఈ నెలాఖరున మునీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో తాను పదవి కోల్పోవడానికి ఆర్మీనే కారణమని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన వేళ మునీర్ నియామకం కీలకంగా మారింది. ఈ నియామక ప్రక్రియ మెరిట్ సహా చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించి జరిగిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.