రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ఖరారైంది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె తొలిసారిగా రాష్ట్రానికి రానుండగా.. డిసెంబర్ 5న విజయవాడలో పర్యటించనున్నారు. కేంద్ర నిధులతో నిర్మించిన 3 జాతీయ రహదారులను ప్రారంభిస్తారు. రాయచోటి-అంగళ్లు, నేషనల్ హైవే 205పై 4 లేన్ల ఆర్ ఓబీ, కర్నూలు ఐటీసీ జంక్షన్ వద్ద నిర్మించిన 6 లేన్లను ఆమె వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అలాగే ముదిగుబ్బ-పుట్టపర్తి రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు.