చంద్రబాబుకు పాలన చేత కాదని, అందుకే ప్రజలు 2019 ఎన్నికల్లోనే బై బై బాబు అని ఇంటికి పంపించారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు పోటీలో ఎక్కడా లేడు. అధికారం అనేది ఇద్దరు వ్యక్తులు నిర్ణయించేదు కాదు… ప్రజలు నిర్ణయించాలన్న స్పృహ కూడా చంద్రబాబుకు లేనట్లు ఉందన్నారు . అధికారం అప్పనంగా రావటం వల్ల ఈ అహంకారం వచ్చిందన్నారు. తనకు తానే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ఒప్పుకున్నాడన్నారు.