రూ.లక్ష పెట్టుబడితో ప్రారంభమైన సంకల్పసిద్ధి ఎమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. 1100 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ముఖ్య అనుచరుడు ఓలుపల్లి రంగా సహకారంతో గుత్తా వేణుగోపాల్ కృష్ణ, కిరణ్ బినామీ పేర్లతో ఈ సంస్థను స్థాపించారన్నారు. రూ. 10 నెలల్లో 20 వేలు కడితే రూ. 60వేలు ఇస్తానని నమ్మబలికి మోసం చేశారని తెలిపారు. గన్నవరం నియోజక వర్గంలో డయేరియా బారిన పడి పేదల ప్రాణాలు పోతున్నా వంశీ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.పేదల సొమ్మును కొట్టేసిన నాని, వంశీలపై కేసులు నమోదు చేయడం ద్వారా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.