గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించిన జన సేనాని పవన్ కళ్యాణ్ కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న పవన్ కళ్యాణ్ బాధితులకు ఆర్థిక సాయం అందించనున్నారు. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది.ఆ గ్రామం ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదిక అవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు జనసేన సభా ప్రాంగణానికి ఆ గ్రామ రైతులు తమ పొలాలను ఇచ్చారని వెల్లడించారు.