కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం మాట్లాడుతూ భారత ప్రభుత్వానికి చెందిన 15 సంవత్సరాలు నిండిన అన్ని వాహనాలను రద్దు చేస్తామని, ఆ మేరకు ఒక విధానాన్ని రాష్ట్రాలకు పంపామని చెప్పారు.15 ఏళ్లు నిండిన భారత ప్రభుత్వ వాహనాలన్నింటినీ రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ఫైల్‌పై సంతకం చేశాను అని అయన తెలిపారు.
గడ్కరీ మాట్లాడుతూ, పానిపట్‌లో ఇండియన్ ఆయిల్‌కు చెందిన రెండు ప్లాంట్లు దాదాపు ప్రారంభమయ్యాయని, అందులో ఒకటి రోజుకు లక్ష లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుందని, మరొకటి వరి గడ్డిని ఉపయోగించి రోజుకు 150 టన్నుల బయో-బిటుమెన్‌ను తయారు చేస్తుందని చెప్పారు.