2008 నవంబర్ 26.. దేశ చరిత్రలో చీకటి రోజు. దేశ ఆర్థిక రాజధాని ముంబైపై ఉగ్రవాదులు దాడి చేసిన రోజు. ముంబై తాజ్ హోటల్ లోకి ప్రవేశించిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 174 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై పోలీసులు, ఆర్మీ ఆపరేషన్ చేపట్టి ఉదగ్రవాదులను మట్టుపెట్టారు. ప్రాణాలతో చిక్కిన కసబ్ అనే ఉగ్రవాదిని దాదాపు నాలుగేళ్ల తర్వాత 2012లో ఉరితీసారు. ఈ ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్, హేమంత్ కర్కరే, తుకారాం అంబ్లే, అశోక్ కామ్తే, విజయ్ సలార్కర్ లాంటి వారి ప్రాణాత్యాగం మరువలేనిది. వారి ప్రాణత్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.