తాను ఏనాడూ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేసీఆర్ కు కీడు తలపెట్టాలనే ఆలోచన కలలో కూడా చేయలేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మరి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే పనికిమాలిన ఆలోచన తనకు ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో పనిచేస్తూ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరో గుర్తించాలని కేసీఆర్ కు రఘురామ సూచించారు. కేసీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. జగన్ మాట విని కొందరు అధికారులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని, తెలంగాణ సిట్ తనకు సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చిందని తెలిపారు.