ఏపీ సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. తమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 11.10 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి, తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అలాగే, నేడు క్యాంప్ ఆఫీస్ లో వైసీపీ బీసీ నేతలతో సీఎం భేటీ కానున్నారు. బీసీలకు అందిస్తున్న పథకాలపై చర్చ నిర్వహించనున్నారు. బీసీలకు పార్టీని చేరువ చేసేలా వైసీపీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.