పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్‌ను ఇస్రో శనివారం ప్రయోగించనుంది. ఉదయం 11:56 గంటలకు ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లనుంది. సీ54 రాకెట్ ద్వారా భూపరిశీలన ఉపగ్రహం ఓషన్‌శాట్, మరో 8 క్లస్టర్ ఉపగ్రహాలను నింగిలోకి పంపించనున్నారు. ఓషన్‌శాట్ ఉపగ్రహం 960 కిలోల బరువు ఉండగా, మిగిలినవి నానో ఉపగ్రహాలు. భారత్-భూటాన్ రూపొందించిన భూటాన్ శాట్, పిక్సెల్ సంస్థకు చెందిన ఆనంద్ శాట్, ధ్రువ స్పేస్ సంస్థ తయారు చేసిన రెండు తైబోల్ట్ శాట్‌లు, యూఎస్ స్పేస్ ఫ్లైట్ సంస్థకు చెందిన 4 ఆస్ట్రోకాస్ట్ శాటిలైట్లను సీ54 ద్వారా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.