కరోనా వ్యాధి నివారణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా ఇన్ కొవాక్ ను బూస్టర్ డోస్ గా వినియోగించేందుకు డీజీసీఐ అత్యవసర అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దీన్ని ‘ఫైవ్ ఆర్మ్స్’ బూస్టర్ డోస్ గా వ్యవహరిస్తారు. ఇప్పటికే రెండు డోసుల కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారు 6 నెలల తర్వాత బూస్టర్ డోస్ గా ఈ చుక్కల మందు తీసుకోవచ్చు. భారత్ లో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా తీసుకునేందుకు డీజీసీఐ అనుమతి ఇచ్చింది.