వచ్చే ఏడాది జనవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో 300 నుంచి 400 వరకు వందే భారత్ రైళ్లపై ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. దీనిద్వారా దేశ ప్రజలందరికీ వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు కలగనుంది. 3-4 ఏళ్లలో 475 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించనున్నట్టు కేంద్ర సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు వీటికి అదనంగా మరిన్ని వందేభారత్ రైళ్ల పై ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యమున్న ఈ వందే భారత్ రైళ్లను ప్రస్తుతం 130 కిలోమీటర్లకే వేగాన్ని పరిమితం చేస్తున్నారు. ప్రస్తుత రైల్వే ట్రాక్ లపై వీటిని వేగంగా నడిపించేలా డిజైన్ లోనూ మార్పులు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa