మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కురగల్లు లో శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆర్కే విస్తృత పర్యటన చేపట్టారు. ఎస్సీ కాలనీలోని ప్రైమరీ పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఆయన నూతన పాఠశాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. అలానే ఎస్సీ కాలనీలోని పలు వీధుల్లో పర్యటించిన ఆయన పారిశుద్ధ్య పనుల పై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో నిర్మించాల్సిన రోడ్ల కి రెండు వైపులా సర్వే నిర్వహించాల్సిందిగా అధికారులను కోరారు.
లైబ్రరీ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. హిందూ మరియు క్రిస్టియన్ స్మశానాల్లో జంగిల్ క్లియరెన్స్, గ్రావెల్ మెరక, కాంపౌండ్ వాల్ విద్యుత్ మరియు నీటి సౌకర్యాలు కల్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. కురగల్లు నుండి బేతపూడి వెళ్లే రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చెయ్యాలని అధికారులతో అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే వెంట రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కట్టెపోగు బసవరాజు, సచివాలయ సిబ్బంది గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.