ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. కానీ, క్రిస్మస్ సందర్భంగా కోచ్ లు, విదేశీ సిబ్బంది అందుబాటులో ఉండరంటూ, వేలం తేదీని మార్చాలంటూ ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. విదేశాల్లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ మధ్య నుండి చివరి వరకు అందరూ సెలవుల్లో ఉంటారని, వేలం తేదీని మార్చాలని అభ్యర్థిస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈసారి 250 మంది క్రికెటర్లు వేలానికి రానుండగా, ఫ్రాంచైజీలకు కావాల్సింది సుమారు 50-60 మందే. ఈసారి శామ్ కుర్రన్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్ కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ ఎక్కువగా ఉండనుంది.