ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షను ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించాలని ఎన్ టీఏ నిర్ణయించింది. కరోనా సమయంలో ఏడాదికి 4 సార్లు నిర్వహించగా.. ఈసారి 2 సార్లే నిర్వహించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధానం అమలు చేయనున్నట్లు ఎన్ టీఏ తెలిపింది. జనవరి, ఏప్రిల్ లో జేఈఈ మెయిన్ నిర్వహణకు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. మెయిన్ పరీక్ష షెడ్యూల్ ను ఎన్ టీఏ వచ్చే వారం విడుదల చేస్తుందని సమాచారం.