వీధి కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని హరీమ్ పుర్ లో జరిగింది. ఓ సఫాయి కార్మికురాలి కూతురు మల విసర్జన కోసం ఇంటి వెనుకకు వెళ్లింది. అదే సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు కాపాడేందుకు పరుగులు పెట్టినా అప్పటికే చిన్నారికి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.