బాదంపప్పును సాధారణంగా స్వీట్లలో లేదా అలానే తినేస్తుంటారు. అయితే ఈ బాదంపప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పప్పు గింజల్లో భాగమైన బాదం మంచి కాల్షియం వనరు. 30 గ్రాముల బాదంపప్పులో 74 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుందని ఒక సర్వేలో తేలింది. అయితే బాదంను పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది. బాదంపప్పులో విటమిన్ ఈ, పొటాషిటం కూడా ఉంటాయి. బాదంపప్పును మితంగా తింటే చెడ్డ కొలస్ట్రాల్ తగ్గడానికి తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.