భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత శక్తి అంతా రాజ్యాంగంలోనే ఉందని.. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని అన్నారు. ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.