ఇస్రో పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా భూపరిశీలన ఉపగ్రహం ఓషన్ శాట్3, మరో 8 క్లస్టర్ ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. ఇందులో ఓషన్ షాట్3 ఉపగ్రహం 960 కేజీల బరువుండగా, మిగతావి నానో ఉపగ్రహాలు. భారత్- భూటాన్ కలిసి రూపొందించిన భూటాన్ శాట్, పిక్సెల్ సంస్థకు చెందిన ఆనంద్ శాట్, ధృవ స్పేస్ సంస్థ రూపొందించిన రెండు తైబోల్డ్ శాట్ లు, యూఎస్ స్పేస్ ఫ్లైట్ సంస్థకు చెందిన 4 ఆస్ట్రోకాస్ట్ శాటిలైట్లను ఈ ప్రయోగం ద్వారా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.