ఏపీలో రానున్న రెండు రోజులు ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెలాఖరులోగా ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.07 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.18 గంటలకు కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa