నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసే పాలకుడు చెడ్డవాడు అయితే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుందని, రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలు ఇస్తుందని అంబేడ్కర్ 1949లో రాజ్యాంగ సభలో అన్నారని బాబు తెలిపారు. జగన్ లాంటి పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి నాడు ఆయన అలా చెప్పి ఉంటారని వెల్లడించారు.