రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రాహుల్ ను చూడటానికి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కిందపడిపోగా, ఆయన చేయి, మోకాలికి గాయాలయ్యాయి. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయనకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్బంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ ఓర్చుకోలేకపోతుందని, యాత్ర పరువు తీసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. యాత్రలో రాహుల్ లేవనెత్తుతున్న బీజేపీ వైఫల్యాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa