ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అర్ధనగ్నతో ప్రదర్శన తో డిమాండ్.విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ తక్షణమే ఆపాలని అర్థనగ్న ప్రదర్శనతో ఆదివారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ వై. రాంబాబు కే. అచ్యుత రావు మాట్లాడుతూ ప్రాణ త్యాగాలతో కమ్యూనిస్టులు ప్రజలు సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు కరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నంలోని కమ్యూనిస్టులు ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు కార్మికులు కలిసి నిరసనలు తెలియజేస్తున్నా బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత 660 రోజులుగా రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న వారి మనోభావాలు లెక్కచేయకుండా నాలుగు రోజులు క్రితం అదాని సంస్థ యాజమాన్యాన్ని స్టీల్ ప్లాంట్ లో సందర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రరాష్ట్రం పట్ల బిజెపి ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని దీనికి తగినంత మూల్యం చెల్లించుకోవాల్సి నా సమయం ఆసన్నమైనదని ఆంధ్రప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు బిజెపి ప్రభుత్వం అంగట్లో అమ్మే మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అదాని అంబానీ లకు కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడమే బిజెపి అజెండాగా మార్చుకున్నారని అని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కరణ ఆపకపోతే అఖిల భారత యువజన సమాఖ్య నేతృత్వంలో ప్రభుత్వం ఊహించిన రీతిలో ఉద్యమాలకు అవసరమైతే ప్రాణత్యాగనికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ మధు రెడ్డి , ఓంకారం లక్ష్మీ, ఆర్. తరుణ్ కార్యకర్తలు పాల్గొన్నారు