ఇటలీలోని ఇస్కియా ఐలాండ్ లో కొండచరియలు విరిగిపడి మూడు వారాల చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. ఇస్కియా ఐలాండ్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో సముద్ర తీరంలో ఉన్న ఒక కొండపై నుంచి కొంత భాగం జారిపోయింది. ఒక్కసారిగా నెట్టుకొచ్చిన కొండచరియల తాకిడికి కొండ కింద ఉన్న భవనాలు కూలిపోయి, పార్క్ చేసిన వాహనాలు సముద్రంలోకి నెట్టివేయబడ్డాయి. ఇస్కియాలో గత 6 గంటల్లో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 20 ఏండ్లలో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.