గోంగూరను ఎంతోమంది ఇష్టంగా తింటారు. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, పీచు ఎక్కువగా ఉంటుంది. గోంగూర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రేచీకటితో బాధపడేవారు గోంగూర తింటే ఫలితం ఉంటుంది. అలాగే దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారు గోంగూర తింటే మంచి ఫలితాలు వస్తాయి. అంతే కాకుండా విరోచనాలు అధికంగా అయ్యేటప్పుడు కొండ గోంగూర నుండి తీసిన జిగురును నీటితో కలిపి త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అయితే, మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతున్న వ్యక్తులు గోంగూరకి దూరంగా వుంటే మంచిది.