ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్నట్లు తెలిపింది. 2022 ఖరీఫ్ సీజన్ లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా రూ.39.39 కోట్లను నేడు సీఎం అందించనున్నారు. మొత్తం 45,998 మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బును జమచేయనున్నారు. అంతే కాకుండా 2020-21. 2021-22లో లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని, చెల్లించని రైతులకు సున్నావడ్డీ రుణాల కింద రైతులు చెల్లించిన వడ్డీ డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.