రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు చెందిన వైయస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్–2022 సీజన్‌లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ సోమవారం బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేయనున్నారు. రబీ 2020–21 సీజన్‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, ఖరీఫ్–2021 సీజన్‌లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమచేయనున్నారు. అదే విధంగా ఖరీఫ్–2022 సీజన్‌లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఖరీఫ్ సీజన్ ముగియక ముందే జమచేయనున్నారు.