కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖలు చేసారు. గుజరాత్ ఏర్పడక ముందు కాంగ్రెస్ గుజరాతీలు, మరాఠీల మధ్య విభేదాలు సృష్టించింది. ఆ తర్వాత ప్రజలను వర్గాలుగా విభజించి అల్లర్లకు పురిగొల్పింది. కాంగ్రెస్ పాపాల వల్ల గుజరాత్ చాలా నష్టపోయింది. కుట్రలను అర్థం చేసుకున్న గుజరాతీలు కాంగ్రెస్ కు తలుపులు మూసేశారు. కులతత్వం, మతతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాలు, విభజించి పాలించు అనే భావజాలాన్ని విడనాడితేనే ప్రజలు పార్టీని విశ్వసిస్తారు అని మోడీ అన్నారు.