నార్పల మండల కేంద్రంలో మంగళవారం లింగ వివక్షతకు ముగింపు కార్యక్రమం భారీ ర్యాళీ నిర్వహించారు. కుల్లాయి స్వామి మండల సమైక్య నుండి బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహం వరకు ఎంపీపీ నాగేశ్వరరావు, సర్పంచ్ సుప్రియ, ఏపిఎం తిప్పమ్మ , మండల సమైక్య అధ్యక్షురాలు రేఖ ఆధ్వర్యంలో ర్యాళీ నిర్వహించారు. ర్యాలీలో లింగ వివక్షతకు మహిళపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ లక్ష్మీనరసింహ, ఎంపీడీవో దివాకర్, తహశీల్దార్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.