గార్లదిన్నె మండలం కొట్టాలపల్లి మరియు కేకే. తాండా గ్రామాలలో మంగళవారం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహించారు. జగనన్న అండ ఉండగా, ఏ దుష్ట చతుష్టయం ఏమీ చేయలేవన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం వీస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ చూసి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa