నందివాడ పరిధిలోని పోలుకొండ, రుద్రపాక, గొల్లగూడెం, గోపాలపురం గ్రామాలకు చెందిన 70 మంది అయ్యప్ప దీక్షాపరులు పోలుకొండ శివాలయంలో సోమవారం కుప్పల వెంకటేశ్వరరావు (వెంకన్న గురుస్వామి) తో ఇరుముడి కట్టించుకుని శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు. వెంకన్న గురుస్వామి మాట్లాడుతూ 41 రోజులు వంద మంది స్వాములకు గోపాలపురంలో చద్ది, భిక్ష ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.