గన్నవరం పంచాయతీ కార్యదర్శి నక్కా రాజేంద్రవరప్రసాద్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సర్పంచ్ నిడమర్తి సౌజన్యతో కలిసి రూ.1.58 కోట్ల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై విచారణ అనంతరం పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి (పీఆర్‌అండ్‌ఆర్డీ) కమిషనర్ కోన శశిధర్ సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ సైనికుడు ఎం.రవి కుమార్, కొందరు పంచాయతీ వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్టోబరు 27న గుడివాడ డీఎల్‌పీవో విచారణ చేసి, నివే దికను డీపీవో ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ నిధులు రూ.1,58,12,672కోట్లు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో పం చాయతీ సాధారణ నిధులు రూ.1,53,58,010, 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.95,155, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3,32,507 ఉన్నట్లు విచారణలో తేలింది. సర్పంచ్ నిడమర్తి సౌజన్య, కార్యదర్శి నక్కా రాజేంద్రవరప్రసాద్‌లను 1:1 నిష్పత్తిలో చెరొక రూ.79,06,336 చొప్పున చెల్లించాలని ఆదేశించారు. నవంబరు 9న సర్పంచ్ చెక్ పవర్‌పై ఆంక్షలు విధిస్తూ డీపీవో ఉత్తర్వులు ఇచ్చారు. చెక్ పవర్‌ను ఎందుకు ఆపకూడదో పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. తమ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని ఉత్తర్వులో కార్యదర్శిపై ఆంక్షలు విధించారు.