టీడీపీతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన్ను పార్టీ కార్యాలయంలో కొమరోలు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రజావ్యతిరేక విధానాల గురించి ఇంటింటికి తెలియజెప్పాల న్నారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబునాయుడితోనే సాధ్యమన్న భావన ప్రజల్లో వచ్చిన దృష్ట్యా రానున్న ఎన్నికలలో వైసీపీ తుడిచిపెట్టుకుని పోవడం ఖాయమన్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాఘవరెడ్డి, కొమరోలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.