కేరళకు చెందిన లెస్బియన్ జంట అదిలా నసరీన్, ఫాతిమా నూరా ఎట్టకేలకు ఒక్కటయ్యారు. వీరి ప్రేమ విషయం తెలిసి తల్లిదండ్రులు అభ్యంతరం తెలపగా ఈ ఏడాది మేలో కోజికోడ్ పారిపోయి ఎల్ జీబీటీక్యూ సొసైటీ ఆశ్రమంలో ఉన్నారు. అనంతరం తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకుంటామని చెప్పి తీసుకెళ్లి మాట మార్చడంతో.. నసరీన్ హైకోర్టును ఆశ్రయించగా తీర్పు అనుకూలంగా వచ్చింది. దీంతో ఎల్ జీబీటీక్యూ సొసైటీ వీరి కోసం బీచ్ లో వేడుకలు ఏర్పాటు చేయగా ఉంగరాలు మార్చుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.